ఏపీలో చిన్నారి అదృశ్యం.. రంగంలోకి NDRF బృందం (వీడియో)

15చూసినవారు
AP: తునిలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం అయ్యాయి. చిన్నారి కనిపించకుండా పోయి తొమ్మిది రోజులు కావడంతో NDRF బృందం రంగంలోకి దిగింది. SDRF, అటవీ శాఖ సిబ్బందితో కలిసి విస్తృతంగా గాలిస్తోంది. అధునాతన డ్రోన్ల సాయంతో అడవి ప్రాంతాలను జల్లెడ పడుతోంది. ఈ కేసుపై రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టి సారించింది. శనివారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆదివారం హోంమంత్రి అనిత జిల్లా ఎస్పీతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. మరోవైపు అనుమానాస్పదంగా మృతి చెందిన పెంపుడు కుక్కకు పోస్టుమార్టం నిర్వహించి పోలీసులు కీలక ఆధారాలు సేకరించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్