AP: తునిలో చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసు మిస్టరీగా మారింది. ఈ నెల 6న ఉదయం 11:50 గంటలకు తండ్రి చిన్నారిని తల్లికి అప్పగించి పొలానికి వెళ్లాడు. మరో చిన్నారిని చూసుకుంటూ ఉండటంతో తల్లి జ్ఞానేశ్వరిని గమనించలేదు. ఇదే సమయంలో తండ్రి వెళ్లిన దారికి సమీపంలో చిన్నారిని చూసిన ఓ వ్యక్తి ఎత్తుకునేందుకు ప్రయత్నించగా కుక్క కరవబోయింది. దీంతో అతడు గ్రామంలోకి వెళ్లి విషయం చెప్పాడు. స్థానికులు వెంటనే వచ్చి వెతికినా చిన్నారి కనిపించలేదు. మధ్యాహ్నం 12 నుంచి 12:15 గంటల మధ్యలో జ్ఞానేశ్వరి మిస్సైనట్లు పోలీసులు వెల్లడించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.