భారతదేశంలో 5 నుంచి 17 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్ తప్పనిసరి అని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్
ఇండియా (UIDAI) ఆదేశించింది. పిల్లలు పెరిగేకొద్దీ వారి బయోమెట్రిక్ వివరాలు మారే అవకాశం ఉన్నందున, ఆధార్ గుర్తింపు ఖచ్చితత్వం కోసం ఈ అప్‌డేట్ అవసరం. విద్యార్థులకు ప్రవేశాలు,
పరీక్షలు, స్కాలర్‌షిప్‌లు, ప్రభుత్వ పథకాలు పొందడంలో ఇది కీలకం. ఈ అప్‌డేట్ 2026 సెప్టెంబర్ 30 వరకు ఉచితంగా అందుబాటులో ఉంటుంది.