భారతదేశం నుండి ఎండు మిర్చి దిగుమతులను చైనా నిషేధించింది. భారతదేశంలో పండే మిర్చిలో హానికరమైన మిథామిడోపాస్ రసాయనాలు అధికంగా ఉన్నాయని, ఇది నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని చైనా పేర్కొంది. ఈ నిర్ణయం భారతీయ మిర్చి రైతులకు, ఎగుమతులపై ఆధారపడిన వ్యాపారులకు తీవ్ర నష్టం కలిగించనుంది. గత ఆర్థిక సంవత్సరంలో చైనాకు
భారతదేశం నుండి 2.36 లక్షల టన్నుల ఎండు మిరపకాయలను ఎగుమతి చేశారు. ఇటీవల బియ్యం దిగుమతులపై కూడా చైనా నిషేధం విధించింది.