ఆన్‌లైన్ మోసాలు, సైబర్ క్రైమ్, గ్యాంబ్లింగ్ కార్యకలాపాలకు పాల్పడుతున్న మయన్మార్‌కు చెందిన 11 మంది సభ్యుల నేర ముఠాపై చైనా కఠిన చర్యలు తీసుకుంది. వీరిపై వేలాది కోట్ల విలువైన స్కామ్‌లకు పాల్పడటంతో పాటు, తమ వద్ద పనిచేస్తూ తప్పించుకునేందుకు ప్రయత్నించిన 14 మంది చైనీయుల ప్రాణాలు తీసిన ఆరోపణలున్నాయి. ఉత్తర మయన్మార్‌లోని మింగ్ ఫ్యామిలీ సహా నాలుగు కుటుంబాలు ఈ నేరాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయని చైనా మీడియా పేర్కొంది. ఈ వ్యవహారంపై విచారించిన వెంజౌ సిటీ న్యాయస్థానం 11 మందిని దోషులుగా తేల్చి మరణశిక్ష విధించింది.