ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఎండల తీవ్రతను తగ్గించడానికి చైనా సరికొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టింది. షాంక్సీ రీజియన్‌లోని ఒక రెసిడెన్షియల్ కమ్యూనిటీలో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ 'మిస్ట్ కూలింగ్ సిస్టమ్', భవనాల పైకప్పుల నుంచి సూక్ష్మ నీటి బిందువులను స్ప్రే చేస్తుంది. ఇవి గాలిలో ఆవిరై, ఐదు నిమిషాల్లో పరిసరాల ఉష్ణోగ్రతను 5 నుండి 8 డిగ్రీల వరకు తగ్గిస్తాయి. పబ్లిక్ ప్రదేశాలను చల్లబరచడానికి రూపొందించిన ఈ టెక్నాలజీ, ఎయిర్ కండిషనర్ల వాడకాన్ని తగ్గించి, విద్యుత్ ఆదాకు, పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుంది.
భారత్ సహా పలు దేశాలు ఈ టెక్నాలజీపై ఆసక్తి చూపుతున్నాయి.