చైనా ప్రత్యేక గ్రీన్‌ టీ.. రూ. 4 లక్షలకు అర కిలో!

6655చూసినవారు
చైనా ప్రత్యేక గ్రీన్‌ టీ..  రూ. 4 లక్షలకు అర కిలో!
బరువు తగ్గడానికి, ఆరోగ్యానికి గ్రీన్‌ టీ తాగడం సర్వసాధారణం. అయితే, చైనాలో లభించే 'లాంగ్‌జింగ్' అనే ప్రత్యేక గ్రీన్‌ టీ ధర వింటే ఆశ్చర్యం కలుగుతుంది. తూర్పు చైనాలోని జెజియాంగ్‌ ప్రావిన్స్‌లో మాత్రమే దొరికే ఈ టీ అర కిలో ధర సుమారు రూ. 4 లక్షల వరకు ఉంటుంది. 18వ శతాబ్దంలో చైనా చక్రవర్తి క్వియాన్‌లాంగ్‌ హాంగ్‌జౌను సందర్శించినప్పటి నుంచి దీనికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. మార్చి మధ్యలో సేకరించే 'మింగ్‌కియాన్‌' అనే ప్రీమియం రకం టీకి అత్యధిక ధర పలుకుతుంది. దీని అద్భుతమైన సువాసన, ఆరోగ్య ప్రయోజనాల వల్ల సంపన్నులు దీనిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్