దక్షిణ కొరియా గగనతలంలోకి పదికి పైగా చైనా, రష్యా సైనిక విమానాలు ప్రవేశించాయి. తూర్పు సముద్రం, దక్షిణ సముద్రం మీదుగా ఉన్న కొరియా వైమానిక రక్షణ గుర్తింపు జోన్ లోకి ప్రవేశించి, ఆపై నిష్క్రమించాయని దక్షిణ కొరియా ధృవీకరించింది. దక్షిణ కొరియా సైన్యం వాటిని గుర్తించి, ఎలాంటి ఆకస్మిక పరిస్థితికైనా సిద్ధంగా ఉండేందుకు వైమానిక దళం యుద్ధ విమానాలను మోహరించింది. చైనా, రష్యా వైమానిక దళాలు వ్యూహాత్మక గగనతల గస్తీ నిర్వహించిన క్రమంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు చైనా స్పష్టం చేసింది.