AP: చింతూరు బస్సు ప్రమాదంలో గాయపడిన బాధితులను ఆసుపత్రిలో హోం మంత్రి వంగలపూడి అనిత పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి వివరాలు వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు మంత్రి అనిత ప్రమాద స్థలాన్ని పరిశీలించి, అక్కడి అధికారులతో మాట్లాడి ఘటనపై పూర్తి సమాచారం తెలుసుకున్నారు. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.