ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా
మెగాస్టార్ చిరంజీవిని నియమించే దిశగా ప్రభుత్వం చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. గతంలో గుజరాత్ టూరిజానికి అమితాబ్ బచ్చన్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన తరహాలోనే, ఏపీ టూరిజం ప్రమోషన్ కోసం చిరంజీవిని నియమించనున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రతిపాదనపై ప్రాథమిక సంప్రదింపులు పూర్తయినట్లు సమాచారం. త్వరలోనే కూటమి ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.