చిరంజీవి ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘విశ్వంభర’ సినిమా విడుదలపై తాజా అప్డేట్ వచ్చింది. సోషియో-ఫాంటసీ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జూలై 10న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. వీఎఫ్ఎక్స్ పనులు చివరి దశకు చేరుకోవడంతో రిలీజ్‌పై క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది. తొలుత సంక్రాంతి 2025కు విడుదల చేయాలని అనుకున్నప్పటికీ, గ్రాఫిక్స్ పనుల కారణంగా పలుమార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే.