తాతయ్యలతో చిట్టి తల్లి డ్యాన్స్.. వీడియో వైరల్

315చూసినవారు
AP: విజయవాడలో వధువు అయేష్ణా ప్రసాద్ సంగీత్ వేడుకలో, తన ఇద్దరు తాతయ్యలతో కలిసి స్టేజిపై డ్యాన్స్ చేసిన ఓ చిన్నారి అందరినీ ఆకట్టుకుంది. చక్కటి దుస్తుల్లో మెరిసిపోతున్న ఆ చిన్నారి, తన తాతయ్యల చేతులు పట్టుకుని ఎంతో ఆత్మవిశ్వాసంతో స్టెప్పులేసింది. పాట మధ్యలో వచ్చే డ్రమాటిక్ బీట్‌కు తాతయ్యలు ఆ పాపను గాలిలోకి ఎత్తగా, ఆ చిన్నారి ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ ప్రేక్షకులను ఫిదా చేసింది. ఈ డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఏకంగా 82 లక్షల మందికి పైగా ఈ వీడియోను చూసి ఆనందించారు.

ట్యాగ్స్ :