
24 మండలాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించిన ప్రభుత్వం
AP: ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి 8 జిల్లాల్లోని 24 మండలాలను కరువు ప్రాంతాలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వీటిలో సాధారణ కరువు మండలాలుగా ఏలూరు జిల్లాలో 7, కడప జిల్లాలో 3, కాకినాడ జిల్లాలో 1, కృష్ణా జిల్లాలో 1 మండలాన్ని ప్రకటించారు. తీవ్ర కరవు మండలాలుగా కర్నూలు జిల్లాలో 6, సత్యసాయి జిల్లాలో 3, అనంతపురం జిల్లాలో 2, మార్కాపురం జిల్లాలో 1 మండలాన్ని గుర్తించారు. గతంలో ప్రకటించిన 388 కరవు మండలాలకు ఇవి అదనమని ప్రభుత్వం ప్రకటనలో పేర్కొంది.




































