చంద్రగిరి మండలం తొండవాడ సమీపంలో మంగళవారం పోలీసులు 22 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని, ఇద్దరు గంజాయి విక్రయదారులను అరెస్ట్ చేశారు. చంద్రగిరి సీఐ సురేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, గంజాయి విక్రయ సమాచారం అందడంతో ఎస్ఐల బృందం దాడులు నిర్వహించింది. పారిపోతున్న షేక్ లాలు, శశి కుమార్ అనే ఇద్దరిని పట్టుకుని, సుమారు రూ. 6.60 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.