చంద్రగిరి: మధ్యాహ్న భోజనం తిని 25 మంది విద్యార్థులకు అస్వస్థత

78చూసినవారు
చంద్రగిరి: మధ్యాహ్న భోజనం తిని 25 మంది విద్యార్థులకు అస్వస్థత
రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు అందజేస్తున్న మధ్యాహ్న భోజనాన్ని తిని విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటన శనివారం తిరుపతి జిల్లా చంద్రగిరిలో కలకలం సష్టించింది. చంద్రగిరి పట్టణం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం భోజనాన్ని విద్యార్థినులకు నిర్వాహుకులు వడ్డించారు. దీంతో సుమారు 25మంది విద్యార్థినులు అస్వస్థతకు లోనయ్యారు. వెంటనే వారిని స్థానిక ఏరియా ఆసుపత్రికి ఆటోల్లో తరలించారు.

సంబంధిత పోస్ట్