చంద్రగిరి: కొబ్బరి నీళ్లపై అవగాహన

1155చూసినవారు
ఎండాకాలంలో శరీరానికి కొబ్బరి నీళ్లు సహజ ఔషధంలా పనిచేస్తాయని మొగరాల జెడ్పీహెచ్‌ఎస్ హెచ్‌ఎం సుమలత తెలిపారు. బుధవారం పాఠశాలలో “ఏప్రిల్ ఫూల్ కాదు-ఏప్రిల్ కూల్” కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జేవీవీ అధ్యక్షుడు వెంకట సిద్ధులు విద్యార్థులకు కొబ్బరి నీళ్ల ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. శీతల పానీయాలు ఆరోగ్యానికి హానికరమని, కొబ్బరి నీళ్లు శరీరానికి చల్లదనం, శక్తి అందిస్తాయని హెచ్‌ఎం అన్నారు.

సంబంధిత పోస్ట్