చంద్రగిరి ఎమ్మెల్యే నాని అవినీతి తిమింగలంగా మారారని వైసీపీ చంద్రగిరి ఇంచార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆరోపించారు. చంద్రగిరిలో బుధవారం జరిగిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ, గత ఒకటిన్నర సంవత్సరాల్లో రూ. 300కోట్లకు పైగా అవినీతి జరిగిందని, తిరుపతి రూరల్ మండలంలోని ప్రతి పంచాయతీలో భూముల కబ్జాలు, ఇసుక–గ్రావెల్ అక్రమ రవాణా జరుగుతున్నాయని విమర్శించారు. అవినీతి చేయలేదని కాణిపాకంలో ప్రమాణం చేయగలరా అని సవాల్ విసిరారు. ఇకపై భూముల కబ్జాలు జరిగితే అక్కడే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.