చంద్రగిరి: ఉపాధి హామీ పథకానికి పూర్తి నిధులు కేటాయించాలి

365చూసినవారు
చంద్రగిరి: ఉపాధి హామీ పథకానికి పూర్తి నిధులు కేటాయించాలి
తిరుపతి రూరల్ మండలం వేమూరు పంచాయతీలో ఉపాధి హామీ కూలీలతో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఏ. రామానాయుడు శుక్రవారం మాట్లాడారు. ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిధులు కేటాయించాలని, మహాత్మాగాంధీ పేరుతోనే ఈ పథకాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే, ఉపాధి హామీ కూలీలకు పనిదినాలు పెంచి, వేతనాలు సకాలంలో చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యుడు కె. రాధాకృష్ణ, నగర కార్యదర్శి జల్లా విశ్వనాథ్, కార్యవర్గ సభ్యుడు కె. పద్మనాభరెడ్డి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్