చంద్రగిరి: రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది: ఎమ్మెల్యే

1776చూసినవారు
చంద్రగిరి: రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది: ఎమ్మెల్యే
పాకాల మండలం సామిరెడ్డిపల్లిలో ఏరువాక పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పులివర్తి నాని, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, రాష్ట్రం అభివృద్ధి చెందితే అందరికీ మేలు జరుగుతుందని అన్నారు. కూటమి ప్రభుత్వం రైతులకు ప్రాధాన్యత ఇస్తోందని, చంద్రగిరి నియోజకవర్గంలోని 26వేల మంది మామిడి రైతులకు రూ. 17 కోట్ల మేర లబ్ధి చేకూరిందని తెలిపారు. చెరువుల అనుసంధానం ద్వారా సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించే పనులు చేపడుతున్నామని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్