చంద్రగిరి: ఒంటరి ఏనుగు.. గ్రామస్తులకు అటవీశాఖ హెచ్చరిక

2281చూసినవారు
చంద్రగిరి మండలం నాగపట్ల చెరువు సమీపంలో ఒంటరి ఏనుగు సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు హెచ్చరించారు. రంగంపేట, నారావారిపల్లి, కందులవారిపల్లి, శేషాపురం, భీమవరం, చిన్న రామాపురం, ఎల్లంపల్లి గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా రాత్రి సమయంలో పొలాల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఏనుగు కదలికలు గమనించినా, సమాచారం తెలిసినా వెంటనే అటవీశాఖ అధికారులకు 7661063050 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్