చిత్తూరు జిల్లాలో మామిడి పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైఎస్ఆర్
కాంగ్రెస్ పార్టీ చిత్తూరు జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు మల్లం చంద్రమౌళిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పంట సాగుకు భారీగా పెట్టుబడులు పెట్టిన రైతులకు ప్రస్తుతం మార్కెట్ లో సరైన ధర లభించడం లేదని, దీంతో మామిడి రైతులు ఆర్థికంగా చితికిపోతున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని మామిడి పంటకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు రైతులకు అవసరమైన మద్దతు అందించాలని ఆయన డిమాండ్ చేశారు.