తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి హైదరాబాద్‌కు చెందిన కె. దీపక్ అనే భక్తుడు గురువారం ఉదయం 178 గ్రాముల బరువున్న బంగారు, రాళ్లతో పొదిగిన కర్ణపత్రముల జతను బహుకరించారు. సుమారు రూ. 23 లక్షల విలువైన ఈ ఆభరణాలను టిటిడి అధికారులకు దాత అందజేశారు. అమ్మవారి దర్శనం అనంతరం టిటిడి అధికారులు దాతకు తీర్థప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో టిటిడి డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఆలయ అర్చకులు బాబు స్వామి, సూపరింటెండెంట్ సురేష్, ఏవీఎస్వో రాధాకృష్ణ, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు చలపతి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.