శ్రీవారి ప్రతిష్ఠ దెబ్బతీసే తప్పుడు ప్రచారం: చెవిరెడ్డి

160చూసినవారు
చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆదివారం సాయంత్రం తుమ్మలగుంటలోని తన స్వగృహంలో మీడియాతో మాట్లాడుతూ, రాజకీయ ప్రయోజనాల కోసమే కూటమి నాయకులు శ్రీవారి ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్ లు నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందని, భక్తులు దానిని తిన్నారని, అదే నెయ్యిని అయోధ్యకు పంపించారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇది కోట్లాది భక్తుల మనోభావాలను గాయపరచడమేనని అన్నారు. అలాగే చంద్రబాబు షూ వేసుకుని పూజలు చేస్తారని ఎద్దేవా చేశారు.

సంబంధిత పోస్ట్