పాకాల మండలం ఉట్లవారిపల్లిలోని ఆనందగిరిపై వెలసిన శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఆలయ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే పులివర్తి నాని అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం ఆలయ పరిసరాల్లో జరుగుతున్న పనులను పరిశీలించిన ఆయన, ఆడికృత్తిక మహోత్సవాల నాటికి ఆలయాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు. ప్రతి మంగళవారం భక్తులకు అన్నదానం నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని, శివపార్వతుల విగ్రహ ప్రతిష్ఠాపన, కోనేరు నిర్మాణ స్థలాలను పరిశీలించారు.