కూటమి ప్రభుత్వ కుట్రలు, రాజకీయ కక్షలతో అక్రమ మద్యం కేసులో అరెస్టయి 226 రోజుల నిర్బంధంలో ఉన్న చంద్రగిరి మాజీ శాసన సభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెయిల్‌పై విడుదలయ్యారు. ఆయన రేపు 31/01/2026 సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య విజయవాడ నుంచి చంద్రగిరి నియోజకవర్గంలోని స్వగ్రామానికి రానుండటంతో వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దామినేడు దగ్గర స్వాగత కార్యక్రమం ఉంటుందని, అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు.