చంద్రగిరి ఎమ్మెల్యే నానిపై చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు

1719చూసినవారు
వైఎస్ఆర్సిపి చంద్రగిరి ఇంచార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తిరుపతి రూరల్ మండలంలో చంద్రగిరి ఎమ్మెల్యే నానిపై తీవ్ర ఆరోపణలు చేశారు. గత ఒకటిన్నర సంవత్సరంలో ఎమ్మెల్యే నాని 300 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని, ప్రతి పంచాయతీలో భూములు కబ్జా చేస్తున్నారని, ఇసుక, గ్రావెల్ అక్రమ రవాణాలో వాటా ఉందని ఆరోపించారు. రాష్ట్రంలో 175 మంది ఎమ్మెల్యేలలో చంద్రగిరి ఎమ్మెల్యే అంత అవినీతిపరుడు ఎవరూ లేరని, ఆయనను ఎమ్మెల్యేగా చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నామని అన్నారు. అవినీతి డబ్బు రాకపోతే నిద్ర పట్టడం లేదని, కాణిపాకంలో ప్రమాణం చేస్తారా అని ప్రశ్నించారు. ఇకపై ఎమ్మెల్యే భూములు కబ్జా చేస్తే అక్కడే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్