ఖేలో ఇండియా - క్రీడా భారత్: కాలనీకే తలమానికం

356చూసినవారు
ఖేలో ఇండియా - క్రీడా భారత్: కాలనీకే తలమానికం
దుర్గసముద్రం జగన్ కాలనీలో 'ఖేలో ఇండియా - క్రీడా భారత్' కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమం కాలనీకే తలమానికం అని సామాజిక కమిటీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు ఉమేష్ గౌడ్, రాజా రామ్ కొనియాడారు. విజేతలకు కమిటీ తరపున కప్పులను బహుకరించడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన కామసాని నరసింహ రెడ్డికి, సహకరించిన కాలనీ సభ్యులు మురగయ్య, రాజా, జగదీష్, దాము, రఘు, మరియు మహిళలందరికీ కమిటీ తరపున కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు A భారతి, S రేఖ, S జాకిర్, సుమన్, మురళి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్