చంద్రగిరి మండల పరిషత్ సమావేశంలో సమస్యలపై సభ్యుల ఆగ్రహం

404చూసినవారు
చంద్రగిరి మండల పరిషత్ సమావేశం శనివారం ఎంపీడీవో కార్యాలయంలో వాడివేడిగా జరిగింది. కొత్తపేటలోని పీర్ల చావిడి స్థలం కబ్జాకు గురైందని, అక్కడ నిర్మాణాలు జరుగుతున్నా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని సభ్యులు ఆరోపించారు. సచివాలయ భవనాల నిర్మాణాలు అసంపూర్తిగా ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కగార్ల కాలనీలో రూ. 80లక్షల వ్యయంతో నిర్మించిన వాటర్ ట్యాంక్ వినియోగంలో లేకపోవడాన్ని ప్రస్తావించారు. రంగంపేటలో అక్రమ మద్యం విక్రయాలు, ఏనుగుల దాడుల సమస్యలపై అధికారులను నిలదీశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్