లిటిల్ ఏంజెల్స్ స్కూల్‌లో శక్తి యాప్‌పై అవగాహన

2చూసినవారు
లిటిల్ ఏంజెల్స్ స్కూల్‌లో శక్తి యాప్‌పై అవగాహన
చిత్తూరు పట్టణంలోని లిటిల్ ఏంజెల్స్ స్కూల్‌లో బుధవారం జిల్లా పోలీసుల శక్తి బృందం అవగాహన కార్యక్రమం నిర్వహించింది. మహిళా డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో, మహిళా పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ సుబ్బారెడ్డి విద్యార్థులకు బాల్యవివాహ నిరోధక చట్టం, పోక్సో చట్టం, 112, 1098 హెల్ప్‌లైన్ నంబర్లు, మహిళల భద్రత కోసం రూపొందించిన శక్తి యాప్ వినియోగంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో భాగంగా శక్తి యాప్‌ను విద్యార్థులతో డౌన్‌లోడ్ చేయించి దాని ప్రయోజనాలను వివరించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండెంట్ ప్రేమకుమారి, ఏఎస్ఐ వెంకటేశ్వరులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్