సురక్షిత చిత్తూరు – మీ భద్రత మా బాధ్యత” కార్యక్రమంలో భాగంగా చిత్తూరు 1 టౌన్ పోలీసులు ఫుట్ పెట్రోలింగ్ బుధవారం నిర్వహించారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు డీఎస్పీ జె. వెంకటనారాయణ ఆధ్వర్యంలో సీఐ చిన్న పెద్దయ్య, ఎస్ఐ నాగప్ప నాయక్ సిబ్బందితో కలిసి గాంధీ కూడలి నుంచి చర్చి వీధి వరకు పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలకు నేరాల నివారణ, మహిళలు–చిన్నారుల భద్రత, సైబర్ మోసాలపై అవగాహన కల్పించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు లేదా డయల్-112కు సమాచారం ఇవ్వాలని సూచించారు.