చైన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్

1084చూసినవారు
చైన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్
చిత్తూరు జిల్లా పెనుమూరు పోలీసులు అంతర్‌రాష్ట్ర చైన్ స్నాచింగ్ ముఠాకు చెందిన ఇద్దరు నిందితులను శుక్రవారం అరెస్ట్ చేశారు. పెనుమూరు, జీడీ నెల్లూరు పరిధిలోని మూడు చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించి, సుమారు రూ. 9 లక్షల విలువైన 64 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఒకరిపై ఇప్పటికే 16 ఆస్తి సంబంధిత కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి పోలీసు సిబ్బందిని అభినందించారు.

సంబంధిత పోస్ట్