చిత్తూరు: స్కూల్ బస్సును ఢీకొట్టిన లారీ

843చూసినవారు
శుక్రవారం ఉదయం చిత్తూరు జిల్లా SRపురం బీసీ కాలనీ వద్ద ప్రైవేట్ స్కూల్ బస్సు, లారీ ఢీకొన్నాయి. SRపురం పరిసర గ్రామాల విద్యార్థులను ఎక్కించుకుని జీడీనెల్లూరు వైపు వెళ్తున్న బస్సును, పళ్లిపట్టు వైపు వస్తున్న లారీ ఢీకొట్టడంతో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్