చిత్తూరులో నులిపురుగుల నిర్మూలనకు అల్బెండజోల్ మాత్రల పంపిణీ

0చూసినవారు
చిత్తూరులో నులిపురుగుల నిర్మూలనకు అల్బెండజోల్ మాత్రల పంపిణీ
చిత్తూరు జిల్లాలో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి లక్ష్మీనారాయణ శుక్రవారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రారంభించారు. 1 నుంచి 19 ఏళ్ల వయస్సు గల బాలబాలికలకు ఉచితంగా అల్బెండజోల్ 400 ఎంజీ మాత్రలు అందిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 3,10,910 మంది బాలబాలికలకు మాత్రలు పంపిణీ చేయనున్నట్లు డీఎంఅండ్‌హెచ్‌ఓ శశిభూషణం రెడ్డి తెలిపారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి మాత్రలు తీసుకోవడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని అధికారులు సూచించారు.

సంబంధిత పోస్ట్