స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్రలో అందరూ భాగస్వాములు కావాలి

2చూసినవారు
స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్రలో అందరూ భాగస్వాములు కావాలి
స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టరేట్ ఏవో బ్యూల కోరారు. శనివారం కలెక్టరేట్ ప్రాంగణంలో సిబ్బందితో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు. ప్లాస్టిక్, క్యారీ బ్యాగుల వినియోగాన్ని తగ్గించి, వాటి స్థానంలో కాటన్, గన్ని బ్యాగులు వినియోగించాలని సూచించారు. పరిసరాల పరిశుభ్రతతో పాటు సమాజసేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కలెక్టరేట్ సిబ్బంది, అన్ని సెక్షన్ల సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్