చిత్తూరు II టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో భార్యను శారీరకంగా, మానసికంగా వేధించి, కత్తితో దాడికి యత్నించి హత్య చేస్తానని బెదిరించిన కేసులో భర్త కె. శరవణను IV AJFCM కోర్టు దోషిగా నిర్ధారించింది. నిందితుడికి ఒక సంవత్సరం జైలు శిక్ష లేదా రూ. 1, 000 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి జి. సురేష్ బాబు శుక్రవారం తీర్పు ఇచ్చారు. కేసు దర్యాప్తు, విచారణలో కృషి చేసిన పోలీసు సిబ్బందిని ఎస్పీ తుషార్ డూడి, IPS అభినందించారు.