చిత్తూరులో గుర్తుతెలియని వ్యక్తి మృతి

1163చూసినవారు
చిత్తూరులో గుర్తుతెలియని వ్యక్తి మృతి
చిత్తూరు నగరంలోని కట్టమంచి పరిధిలోని ఓ కొబ్బరి తోటలో సుమారు 60 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటనపై చిత్తూరు వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక విచారణలో మృతుడు తమిళం మాట్లాడే వ్యక్తిగా గుర్తించారు. ఆయనను గుర్తించగలిగిన వారు లేదా కుటుంబ సభ్యులు, బంధువులు ఎవరైనా ఉంటే చిత్తూరు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ చిన్న పెద్దయ్యను 9440796707 నంబర్‌లో సంప్రదించి సమాచారం అందించాలని చిత్తూరు జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్