జీడి నెల్లూరు మండలంలో వ్యక్తి బ్లాక్ మెయిల్

2111చూసినవారు
జీడి నెల్లూరు మండలంలో వ్యక్తి బ్లాక్ మెయిల్
జీడీ నెల్లూరు మండలానికి చెందిన తుమ్మలపల్లి వీరయ్య, మరో వ్యక్తితో కలిసి సబ్-రిజిస్ట్రార్ ను లక్ష్యంగా చేసుకుని బ్లాక్ మెయిల్ దందాకు పాల్పడినట్లు మదనపల్లి పోలీసులు తెలిపారు. వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి, ఫోన్ కాల్స్, వాట్సాప్ సందేశాల ద్వారా బెదిరింపులకు దిగుతూ, రూ. 50 లక్షలు, ఇంటి స్థలం ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం కేసు నమోదు చేసి, నిందితులను రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్