గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని మండలాలలో అన్యాయానికి గురైన వైసీపీ కార్యకర్తలకు అండగా నిలవడానికి ఆదివారం మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి 'డిజిటల్ బుక్' క్యూఆర్ కోడ్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వచ్చే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కార్యకర్తలకు పెద్దపీట వేయడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ పార్టీ గెలుపుకు కృషి చేయాలని సూచించారు.