ఎస్ఆర్ పురం మండలంలో రోడ్డు ప్రమాదం

266చూసినవారు
ఎస్ఆర్ పురం మండలంలో రోడ్డు ప్రమాదం
శనివారం రాత్రి జీడి నెల్లూరు నియోజక వర్గం, ఎస్ఆర్ పురం మండలం, నాయుడుపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. పల్లిపట్టు నుంచి చిత్తూరు వైపు వెళ్తున్న కారు, ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు దెబ్బతినగా, అందులో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు ఈ వివరాలు అందించారు.

సంబంధిత పోస్ట్