గూడూరులో గ్యాస్ సిలిండర్లు బ్లాక్ మార్కెట్‌కు ఎలా వెళ్తున్నాయో ప్రజలకు స్పష్టంగా చెప్పాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి శ్రీనివాసులు గౌడ్ డిమాండ్ చేశారు. నిజాయతీగా బుకింగ్ చేసుకున్న వినియోగదారులకు సమయానికి గ్యాస్ సరఫరా చేస్తే ఇలాంటి సమస్యలు తలెత్తవని ఆయన అన్నారు. పాలకులు, అధికారులు పంపిణీ వ్యవస్థపై నిర్దిష్ట సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫయాజ్, గౌస్ బాషా పాల్గొన్నారు.