జెమ్స్ స్కూల్లో విద్యార్థుల ప్రతిభకు G-FAT పరీక్ష

4559చూసినవారు
జెమ్స్ స్కూల్లో విద్యార్థుల ప్రతిభకు G-FAT పరీక్ష
రాపూరు పట్టణంలోని GEMS SCHOOL నందు 2026-27 విద్యా సంవత్సరానికి గాను GEMS FOUNDATION ASSESSMENT TEST (G-FAT) పరీక్షను విద్యార్థుల విద్యా ప్రమాణాలను మెరుగుపరిచే లక్ష్యంతో ఘనంగా నిర్వహించారు. ఈ పరీక్ష ద్వారా విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, వారి అభ్యాస సామర్థ్యాలను అంచనా వేయడం జరుగుతుంది. ప్రాథమిక జ్ఞానం, విషయ అవగాహన, ఆలోచనా శక్తి, విశ్లేషణ సామర్థ్యం మరియు ప్రతి సబ్జెక్టులో వారి ప్రగతి స్థాయిని తెలుసుకోవడానికి ఈ పరీక్షను రూపొందించినట్లు పాఠశాల యాజమాన్యం తెలిపింది. ఈ పరీక్ష తిరుపతి, గూడూరు, వెంకటగిరి ప్రాంతాల్లోని విద్యార్థులకు నిర్వహించబడింది.

సంబంధిత పోస్ట్