గూడూరు: చేనేతలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ప్రారంభం

224చూసినవారు
గూడూరు: చేనేతలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ప్రారంభం
గూడూరు మండలంలోని చెన్నూరులో బుధవారం ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్ చేనేత కుటుంబాలను కలిసి ప్రభుత్వ కొత్త పథకాన్ని వివరించారు. ఈ పథకం ప్రకారం, చేనేత కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ నేటి నుంచి అమల్లోకి వచ్చిందని తెలిపారు. ఆయన ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు అందజేస్తూ పథకం లబ్ధిని వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు శ్రావణి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్