గూడూరు పట్టణంలోని సనత్‌నగర్ సమీపంలోని పూలతోట గిరిజన కాలనీలో వారం రోజులుగా చెత్త తొలగించకపోవడంతో గుట్టలుగా పేరుకుపోయి తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. పారిశుద్ధ్య నిర్వహణ లోపించడంతో కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారు. చెత్త పేరుకుపోవడంతో దోమలు, ఈగలు పెరిగి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే చెత్త తొలగించి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని మున్సిపల్ అధికారులను కోరుతున్నారు.