కోట రైతు ఉత్పత్తి దారుల సమాఖ్య (ఎఫ్ పిఓ) ద్వారా రైతులను ప్రకృతి వ్యవసాయం చేసేలా ప్రోత్సహిస్తున్నట్లు ఏపిఎం అనిలా కుమారి తెలిపారు. గురువారం ఆమె ఎఫ్ పిఓ, ప్రకృతి వ్యవసాయ సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ, ఎఫ్ పిఓ ద్వారా రైతులకు అవసరమైన వ్యవసాయ పనిముట్లు అందజేస్తామని చెప్పారు. గ్రామాల్లో ఎక్కువ మంది రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లేలా అధికారులు, సిబ్బంది సమన్వయంతో కృషి చేయాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ పిఓ సిసి శంకరయ్య, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.