గూడూరు మండలం చవటపాలెంలో 2020లో జరిగిన దారుణ అత్యాచారం, హత్య కేసులో నలుగురు నిందితులకు నెల్లూరు 8వ అదనపు జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించింది. న్యాయమూర్తి సోమశేఖర్ బుధవారం ఈ తీర్పు వెలువరించారు. మానసిక దివ్యాంగురాలైన పర్వీన్‌పై నిందితులు అత్యాచారం చేసి, హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. శివకుమార్, శరత్, వినోద్ కుమార్, కృష్ణయ్యలను దోషులుగా తేల్చి కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది.