గూడూరు: దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి: సీఐటీయూ

1028చూసినవారు
గూడూరు: దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి: సీఐటీయూ
ఫిబ్రవరి 12న జరగనున్న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ నాయకులు బుధవారం పిలుపునిచ్చారు. ఈ మేరకు గూడూరు ఆర్టీసీ డిపో మేనేజర్ పి. సి. హెచ్. లక్ష్మికి సీఐటీయూ నాయకులు సమ్మె నోటీసులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గూడూరు పట్టణ సీఐటీయూ నాయకులు బీవీ రమణయ్య, పామంజి మణి, అడపాల ప్రసాద్, గండికోట మధు, కె. ఎస్. వాసులు, జి. కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. కార్మికులందరూ సమ్మెలో పాల్గొని దానిని జయప్రదం చేయాలని వారు కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్