చిల్లకూరు మండలం నెలబల్లి, రెట్టపల్లి గ్రామాలకు చెందిన పలువురు వైసీపీ నాయకులు, గురువారం ఉప సర్పంచ్ అన్నంరెడ్డి రమేష్ రెడ్డితో పాటు పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ వారికి పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ప్రజలు టీడీపీలో చేరుతున్నారని ఎమ్మెల్యే అన్నారు. ఈ చేరికలతో చిల్లకూరు మండలంలో పార్టీ బలం మరింత పెరిగిందని నాయకులు తెలిపారు.