గూడూరు ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌గా డాక్టర్ కె. రాంప్రసాద్ రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో కోవూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వాణిజ్య శాస్త్ర అధ్యాపకుడిగా, వైస్ ప్రిన్సిపల్‌గా పనిచేసిన ఆయన, ఇటీవల పదోన్నతి పొంది గూడూరు కళాశాలకు ప్రిన్సిపల్‌గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.