ఆదివారం గూడూరు మండలం చెన్నూరు గ్రామంలోని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం అధికారిని జ్యోతి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. చెన్నూరు ఆరోగ్య కేంద్ర పరిధిలోని 29 కేంద్రాల్లో 4500 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని, కేవలం చెన్నూరు గ్రామంలోనే 800 మంది చిన్నారులు ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమం పల్స్ పోలియో సందర్భంగా జరిగింది.