
కుప్పం: గ్రానైట్ లారీ బోల్తా
చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలోని సోమాపురం గ్రామ సమీపంలో సోమవారం గ్రానైట్ లారీ బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అతన్ని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

































